TS : ఇది పక్కా..! GHMC మేయర్ బీఆర్ఎస్ కు గుడ్ బై!

గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు (BRS) మరో బిగ్ షాక్ తగిలేలా ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి త్వరలోనే కాంగ్రెస్‌లోకి (Congress) వెళ్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. గద్వాల విజయలక్ష్మితో పాటు మరో 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం.
8 ఏళ్ల కిందట 2016లో తొలిసారి బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా గెలిచారు విజయలక్ష్మి. 2021లో రెండోసారి గెలిచి మేయర్‌గా బంపరాఫర్ కొట్టేశారు. ఇఫ్తార్ విందుకు హాజరైన ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ కొన్ని ఆసక్తికరమైన అంశాలు సన్నిహితులతో పంచుకున్నారు.
రీసెంట్ గా GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో దానం నాగేందర్ భేటీ అయ్యారు. త్వరలోనే ఆమె కూడా కాంగ్రెస్ లో చేరనున్నారని అప్పుడే విషయం బయటపడింది. ఇఫ్తార్ విందులో ఈ టాపిక్ పై స్పందించిన దానం.. BRSలో ప్రజా ప్రతినిధులకు విలువ లేదు. అందుకే అందరూ BRSను వీడుతున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో పాటు KK కూడా కాంగ్రెస్ లోకి వస్తున్నారని హింట్ ఇచ్చారు. తనను అనర్హుడిగా ప్రకటించాలని KTR సుప్రీంకోర్టుకు వెళ్తే.. తాను కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతా అన్నారు. బీఆర్ఎస్ లో కనీసం ప్రోటో కాల్ పాటించలేదనీ.. కింద్రాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అని ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com