Gold Seize : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లాకర్ లో గోల్డ్ సీజ్

పటాన్ చెరువు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లాకర్ నుంచి 1.2 కేజీల గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఇటీవల మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2 రోజుల పాటు ఆయన నివాసం, ఆఫీస్ లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. మొత్తం రూ.300 కోట్ల అవినీతి జరిగిందని సోదాల్లో గుర్తించారు. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది.
రూ.39కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో.. ఈడీ రంగంలోకి దిగింది. జులై 2న ఈడీ విచారణ కు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో ఆయన హాజరయ్యారు. స్టేట్‌మెంట్ రికార్డ్ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి ఆయన వెళ్లిపోయారు. మళ్లీ విచారణకు పిలిస్తే వస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు.
మహిపాల్ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా ఈడీ దూకుడు పెంచింది. గురువారం పటాన్‌చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com