Medaram Jatara : మేడారం బస్సులో బంగారం చోరీ

Medaram Jatara : మేడారం బస్సులో బంగారం చోరీ
X

మేడారం జాతరకు (Medaram Jatara) వెళ్లి వస్తున్న ఇద్దరు వ్యక్తుల మెడలో నుంచి బంగారం (Gold) చోరీకి గురైంది. అలసిపోయి నిద్రమత్తులో ఉండగా గుర్తు తెలియని వ్యక్తు లు బంగారాన్ని చోరీ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లాకు చెం దిన గంగాధర మధు, అతడి భార్య స్వప్న ఆదివారం మేడారం జాతరకు వెళ్లారు. దైవ దర్శ నం తర్వాత ఇద్దరు కలిసి మధ్యాహ్నం 2.30 గంటలకు మేడారం బస్‌స్టేషన్‌లో ఆర్టీసీ బస్సును ఎక్కారు.

పొద్దంతా అలసిపోయి ఉండడంతో వారు బస్సులోఎక్కి కూర్చున్న తర్వాత నిద్రలోకి జారుకున్నారు. సాయంత్రం 6గంటల వరకు హనుమకొండ కొత్తబస్‌స్టేషన్‌లో దిగిన తర్వాత మెళకువ వచ్చి మెడలో చూసుకోగా ఇద్దరి మెడలో ఉన్న బంగారు గొలుసు, పుస్తెల తాడు కనిపించలేదు. లబోదిబో మంటూ చుట్టుపక్కల వారిని అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది.

అంతే కాకుంగా మధు జేబులో ఉన్న పర్సును కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. సోమవారం హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. 50 గ్రాముల బంగారం, రూ.8వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్టు బాధితులు తెలిపారు

Tags

Next Story