Good News : ఆరోగ్య శ్రీలో కొత్తగా 65 వ్యాధులు

X
By - Manikanta |10 Jun 2024 12:31 PM IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ద్వారా మరో 65 జబ్బులకు చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. యాంజియోగ్రామ్ పార్కిన్ సన్ వెన్నముక కు సంబంధించిన అధునాతన చికిత్స విధానాలను ఈ పథకంలో చేర్చింది. ఆదివారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వైద్య నిపుణుల సూచనతో ప్రస్తుత ప్యాకేజీని తెలంగాణ ప్రభుత్వం అప్ డేట్ చేసింది. 1,376 విధానాల ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ. 497.29 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com