Hyderabad : హైదరాబాద్ లోనే గూగుల్ మొట్టమొదటి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్

Hyderabad : హైదరాబాద్ లోనే గూగుల్ మొట్టమొదటి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్
X

ఇండియాలోనే మొదటిదైన గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీని) ను హైదరాబాద్లో నెలకొల్పడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. వరల్డ్ వైడ్ గా చూస్తే.. ఇది ఐదో ఇంజినీరింగ్ సేఫ్టీ సెంటర్. ఆసియా పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత రెండో సెంటర్ మన హైదరాబాద్ లోనే ఏర్పాటుచేస్తున్నారు. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ ఆధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయింది.

ఈ ఏడాది అక్టోబరు 3న జరిగిన 'గూగుల్ ఫర్ ఇండియా 2024' కాన్ క్లేవ్ లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ జీఎస్ఈసీకి సంబంధించిన కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ కేంద్రం ఒక స్పెషలైజ్డ్ ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ హబ్. లేటెస్ట్ సెక్యూరిటీ, ఆన్లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Tags

Next Story