Gram Panchayat Elections : జూన్ చివరి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు?

జూన్ చివరి వారంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయని భువనగిరి లోక్‌సభ సమీక్ష సమావేశంలో కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ (CM Revanth) చెప్పినట్లు సమాచారం. ఎంపీ ఎన్నికల తర్వాత జూన్ ఫస్ట్ వీక్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, జూన్ చివరిలోపు ఎన్నికలు జరుగుతాయని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సంక్షేమ పథకాల కోసం ఇందిరమ్మ కమిటీలు వేస్తామని, ప్రతి కమిటీ సభ్యునికి రూ.6వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తామన్నారట.
రాష్ట్రంలో సర్పంచ్ ల పదవీకాలం ఇప్పటికే ముగిసింది. ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. ఇక ఎంపీటీసీల టర్మ్ జులై 3 వరకు ఉండగా, జడ్పీటీసీల టర్మ్ జులై 5 వరకు ఉందని పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ర్టంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా.. 539 జడ్పీటీసీ స్థానాలు, 5,857 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019లో సర్పంచ్, ఎంపీటీసీ , జడ్పీటీసీల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు.
లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ర్ట ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉంది. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగిసినంక రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే, వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com