Gunfire in Nampally : నాంపల్లిలో గన్ ఫైర్.. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఇద్దరు దొంగలపై గురువారం అర్ధరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు నాంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. విషయం గమనించిన పోలీసులు వారిని ప్రశ్నించేయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా దుండగులు పోలీసులపై గొడ్డలితో పాటు రాళ్లతో దాడికి యత్నించారు. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయే యత్నం చేశారు.
పోలీసులు వారిని పట్టుకునే యత్రంలో కాల్పులు జరిపారు. పోలీసులు ఒకవైపు తుపాకులతో కాల్పులు జరుపుతూ మరోవైపు వారిని వెంబడించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుల్లో శాయినాజ్ గంజ్ ఠాణా పరిధిలోని మంగర్ బస్తీకి చెందిన రాజుగా గుర్తించారు. బుల్లెట్లొడ భాగంలోకి దూ సుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కాగా అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల అదుపులో ఉన్న నిందితులు రైల్వే స్టేషన్లో పిక్ పాకెటింగ్, మొబైల్స్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో తేలింది. గురువారం అర్థరాత్రి సమయంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఫుట్ పాత్ HW నిద్రిస్తున్న ఓ వ్యక్తి నుంచి నిందితులు రూ. 400 చోరీ చేసినట్లు గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com