TG : అక్రమ అరెస్టులు, నిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తున్నా : హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిని అడ్డుకుంటారనే అనుమానంతో బీబీనగర్, వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, చిట్యాల మండలాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిని ఆలేరులో హౌస్ అరెస్టు చేశారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చి రుమర్తి లింగయ్యను అదుపులోకి తీసుకున్నా రు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. వలిగొండ, సంగెంలో వందలాది మంది పోలీ సులను మోహరించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాదయాత్ర సంద ర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలను తీవ్రంగా ఖండిస్తు న్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 'ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది. మూసీ మురికి కూపంగా మారడానికి 50 ఏండ్ల కాంగ్రెస్ పాలన కారణం కదా? పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా మీ కాంగ్రెస్ పార్టీ పాపం పోదు. పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, మీ పాదయాత్ర మరో చోట. హైద రాబాదులో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పా దయాత్ర చేస్తారా? దమ్ముంటే.. హైదరాబాద్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టండి. ప్రజల మద్దతే ఉండి ఉంటే, ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకు రేవంత్ రెడ్డి? కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటున్న' అంటూ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com