TG : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని బీఆర్ఎస్ MLA హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘గతంలో ఇదే డిమాండ్ భట్టి విక్రమార్క చేశారు. మీ ప్రకటనకు కట్టుబడి 1:100 చొప్పున ఎంపిక చేయాలి. గ్రూప్ 2,3 పోస్టుల సంఖ్య పెంచాలి. మెగా DSC, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. నిరుద్యోగులకు రూ.4వేలు భృతి ఇవ్వాలి’ అని లేఖలో పేర్కొన్నారు. తమవి కొత్త డిమాండ్లు కావని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే అన్నారు. రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రంథాలయాలకు, కోచింగ్ సెంటర్లకు వచ్చి ఇచ్చిన హామీలే అని గుర్తు చేశారు. అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తి నోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదని మండిపడ్డారు. సీఎం, మంత్రులు, అధికారం యంత్రాంగం మొత్తం ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను సంఘవిద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండటం దౌర్భాగ్యం అని ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com