TS : బాబోయ్ ఎండలు.. 42 డిగ్రీలు దాటేశాయి

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నెలాఖరులోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ జిల్లాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. పశుపక్ష్యాదులు వేడికి సతమతమవుతున్నాయి. గురువారం నల్లగొండ జిల్లా తిమ్మాపూర్‌లో 42.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి)లో 42.3, అదే జిల్లా తలమడుగు, సూర్యాపేట జిల్లా తొగర్రాయి, మేడ్చల్ జిల్లా బాలానగర్‌లో 42.1, అదే జిల్లా కుత్భుల్లాపూర్, కూకట్‌పల్లిలో 42, యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాలలో 41.8, రంగారెడ్డి జిల్లా నాగోల్‌లో 41.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని పలు జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలను ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశించింది. వేసవి సెలవులు మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు ఉంటాయని, జూన్ 1 నుంచి కాలేజీలు పనిచేస్తాయని గురువారం అధికారులు వెల్లడించారు.
ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని, ఒకవేళ నిబంధనలు పాటించకుండా తరగతులు నిర్వహిస్తే కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు. కాగా, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది అడ్మిషన్లను ఇప్పుడే చేపట్టవద్దని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com