TS : హైదరాబాద్‌లో భారీ ఉష్ణోగ్రతకు కారణం ఇదే

TS : హైదరాబాద్‌లో భారీ ఉష్ణోగ్రతకు కారణం ఇదే

హైదరాబాద్ మహానగరంలో ఎండలు మండిపోతున్నాయి. వేడి రోజురోజుకు పెరగడంపై తిరుచ్చి ఎన్ఐటీ అధ్యయనం కీలక విషయాలు వెల్లడించింది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పెరగడానికి కాలుష్యం కూడా కారణమని తెలిపింది. అధిక వేడి ఉన్న ప్రాంతాల్లో ప్రమాదకర కాలుష్య పదార్థాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.

నగరంలోని 80 శాతం ప్రాంతం అత్యంత కాలుష్యమని పేర్కొంది. నగరంలోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద అత్యధిక కాలుష్యం ఉన్నట్లు తెలిపింది. ట్రాఫిక్ సిగ్నళ్లకు అటూ, ఇటూ 3 వందల మీటర్ల వరకు కాలుష్య ప్రభావం ఉన్నట్లు తెలిపింది. కాలుష్యంగా పాటు గాల్లో మందంగా దుమ్ము, ధూళి ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో 70 లక్షల వాహనాలు ఉండగా.. ప్రతి నెల కొత్తగా 25వేల వాహనాలు రోడ్డెక్కుతున్నాయి.

నగరాల్లో విడుదలయ్యే కాలుష్యంలో వాహనాల నుంచి 40 నుంచి 70 శాతం కాలుష్యం వెలువడుతున్నట్లు స్టడీ తెలిపింది. అయితే కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై కఠిన ప్రణాళిక అమలుచేస్తే ప్రకృతి వైపరీత్యాలనుంచి జనాన్ని కాపాడినట్టవుతుందని తెలిపారు.

Tags

Next Story