TS : రేపు సంగారెడ్డిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రేపు సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో బహిరంగ సభకు హాజరుకానున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి తరఫున ఆయన ఓట్లు అభ్యర్థించనున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా సుల్తాన్‌పూర్‌లోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ సభకు సుమారు లక్ష మందిని సమీకరించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావు సభ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. కాగా మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీజేపీ తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని, కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభించామని, కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిన హామీలు గుర్తు వచ్చేలా రైతులు, యువకులు, మహిళలు, గొల్ల కురుమలు రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాయాలన్నారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com