Rains : తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు

Rains : తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు
X

నేటి నుంచి నాలుగురోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపిందిఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మల్కాజిగిరి, సూర్యాపేట జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ఇప్పటికే హైదరాబాద్ సహా పలుచోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది.వర్షాలతోపాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయని దీంతో స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయన్నారు. అల్లూరి జిల్లా, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Tags

Next Story