TG : హైదరాబాద్ లో భారీ వర్షం.. తగ్గే వరకూ బయటకెళ్లకండి
హైదరాబాద్ ( Hyderabad ) నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, అల్వాల్, బాల్ నగర్, బోయిన్ పల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది.
భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈక్రమంలో రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ వరద నీటిని తొలగించేందుకు DRF సిబ్బంది కృషి చేస్తున్నట్లు GHMC తెలిపింది. ఎలాంటి సమస్యలున్నా 040-21111111, 9000113667 ఫోన్ చేయాలని తెలిపింది. ద్విచక్ర వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. వర్షం తగ్గే వరకూ బయటకెళ్లకపోవడమే మంచిది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com