TS : భారీవర్షం.. రోడ్లపైకి వచ్చిన మేయర్

TS : భారీవర్షం.. రోడ్లపైకి వచ్చిన మేయర్

సాయంకాలం వర్షానికి హైదరాబాద్ షేక్ అయింది. భారీ వర్షానికి ముఖ్యంగా బంజారాహిల్స్ చుట్టుపక్కల అతలాకుతలమైంది. డివిజన్లోని ఉదయ నగర్ కాలనీలో పరిస్థితి దారుణంగా ఉంది.

భారీ వర్షానికి నాలా స్లాబ్ కొట్టుకొని పోయింది. మరోవైపు కాలనీలోని రోడ్డు కూడా కొట్టుకుపోయింది. వరద నీరు కాలువలా ప్రవహిస్తోంది. అదే ప్రాంతంలో వర్షం దాటికి టూ వీలర్లు సైతం వరదలో కొట్టుకుపోయాయి.

కురిసిన 5 సెంటీమీటర్ల వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నాలా స్లాబ్ కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై GHMC ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మేయర్. అధికారులకు ఫోన్ చేసి మేయర్ ఇచ్చిన ఆదేశాలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన విమర్శలకు కౌంటర్ గా మేయర్ రెయిన్ కోట్ వేసుకుని వర్షంలో రోడ్డుపైకి వచ్చారని చెబుతున్నారు.

Tags

Next Story