TS : వరదకు విలవిల్లాడుతున్న హైటెక్ నగరం.. హెవీ ట్రాఫిక్ జాం
హైదరాబాద్ లో ప్రధాన ప్రాంతాలైన నాంపల్లి, సికింద్రాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా, ఐటీ కారిడార్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ రద్దీ ఉంది.
దీంతోపాటు కూకట్‌పల్లి, ఖైరతాబాద్, ఉప్పల్, బాచుపల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, యూసఫ్ గూడ, నిజాం పేట సహా పలు ప్రాంతాల్లో వర్షం రాకతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాన్ హోల్స్ నిండిన పలు ప్రాంతాలను క్లియర్ చేస్తున్నారు.
సిటీలోని అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com