TG : ఐదురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

TG : ఐదురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
X

తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ విభాగం తెలిపింది. కిందిస్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి రాష్ట్రం వైపుకు వీస్తున్నాయంది.

ఈ నెల 17న ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.

నైరుతి వ్యాప్తితో తెలంగాణకు వాతావరణశాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ వ్యాప్తంగా వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గురువారం రాష్ట్రంలోని కొమరం బీం అసీఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జగిత్యాల, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Tags

Next Story