TS : కడియం శ్రీహరికి భారీ షాక్

TS : కడియం శ్రీహరికి భారీ షాక్

Congress : కాంగ్రెస్ లో చేరకముందే కడియం శ్రీహరికి (Srihari) వరంగల్ లోకల్ హస్తం లీడర్లు షాకిస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) కీలక నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిక వ్యవహారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దుమారం రేపుతోంది. పార్టీని ఆపత్కాలంలో వదిలేసి స్వార్థం కోసం వీడుతున్నారని అటు బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతుండగా.. చేరికను వ్యతిరేకిస్తూ ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఏకం అవుతున్నారు.

కడియం శ్రీహరి సొంత అడ్డా స్టేషన్‌ఘన్‌పూర్‌. అక్కడికి ఆయన వస్తే తమ పరిస్థితి ఏంటనేది లోకల్ కాంగ్రెస్ లీడర్ల ఆందోళన. అందుకే.. ఆ పార్టీ శ్రేణుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దంటూ అధిష్టానానికి సూచనలు ఇచ్చారు స్టేషన్ ఘన్ పూర్ ఇన్‌చార్జి సింగపురం ఇందిర. ఆమె వివిధ మండలాల ముఖ్యనాయకులు, కార్యకర్తలతో శుక్రవారం హైదరాబాద్‌ వెళ్లి కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీకి కడియంపై ఫిర్యాదు చేశారు.

ముప్పై ఏళ్లుగా శ్రీహరి నియంతృత్వ ధోరణి వల్ల పార్టీ ఎంత నష్టపోయిందని.. ఆయన ఇబ్బందులు పెట్టినా పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందర. రానున్న 2 రోజుల్లో వేలాది మంది కార్యకర్తలతో నియోజకవర్గంలో భారీ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కడియం శ్రీహరి చేరికను ఏ విధంగా వ్యతికిరేస్తున్నారో అధిష్టానానికి తెలిసే విధంగా సభ నిర్వహిస్తామని హెచ్చరించారు లోకల్ లీడర్లు.

Tags

Read MoreRead Less
Next Story