Heavy Rains in Telangana : తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు

Heavy Rains in Telangana : తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు
X

తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, NZB, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వీటితో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు ఏపీలో నేడు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.

ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోని నెల్లూరు, ప్రకాశం, అల్లూరి, మన్యం జిల్లాలు, తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. తెలంగాణలోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.

Tags

Next Story