TS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

TS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

మేడ్చల్, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు సమాధానం చెప్పాలని తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది.

బ్యాంక్ ఖాతా లేకపోయినా ఐటీ రిటర్న్స్ ఎలా దాఖలు చేశారని మల్లారెడ్డి ఎన్నికను కాంగ్రెస్ నేత వజ్రేశ్ సవాల్ చేశారు. సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని పేర్కొన్నారని, రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి, నాలాగా ఉందన్నారు. ఇక జనగామ ఎమ్మెల్యే పల్లా ఎన్నికపై కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పిటిషన్ వేశారు. రెండు పిటిషన్లల్లోని ఆధారాలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి విచారణను జూన్‌ 16కు వాయిదా వేశారు.

అలాగే ఈ రెండు నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌ రూంలలో ఉన్న ఈవీఎంలను వచ్చే లోక్‌సభ ఎన్నికలకు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను న్యాయమూర్తి అనుమతించారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఈవీఎంలను వినియోగించుకోవడానికి అనుమతించారు.

Tags

Read MoreRead Less
Next Story