Hindu Marriage Act : హిందూ వివాహ చట్ట ప్రకారం ఎస్టీలకు విడాకులు ఇవ్వొచ్చు: హైకోర్టు

Hindu Marriage Act : హిందూ వివాహ చట్ట ప్రకారం ఎస్టీలకు విడాకులు ఇవ్వొచ్చు: హైకోర్టు
X

హిందూ వివాహ చట్టప్రకారం పెళ్లి చేసుకున్న ST(లంబాడా) దంపతులకు విడాకులు మంజూరు చేయొచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ జంట డివోర్స్ కోసం కామారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హిందూ చట్టంలోని సెక్షన్ 2(2) ప్రకారం జడ్జి తిరస్కరించారు. దీంతో భర్త హైకోర్టుకు వెళ్లారు. వీరికి హిందూ చట్టాన్ని వర్తింపజేయకపోతే బహుభార్యత్వం అమలవుతుందని అతని తరఫు లాయర్ వాదించారు. దీంతో జడ్జి సానుకూలంగా స్పందించారు.

హిందూ లంబాడా వర్గానికి చెందిన వారని.. హిందూ వివాహ చట్టం వారికి వర్తించకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు లంబాడా వర్గానికి చెందిన వారైనా వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినందున ట్రయల్‌ కోర్టు పూర్తి ఆధారాలను పరిశీలించి ఆ మేరకు విడాకులు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలానికి చెందిన కడావత్‌ శ్రీకాంత్‌, అశ్విత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు కామారెడ్డి సివిల్‌ కోర్టును ఆశ్రయించడంతో.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి హిందూ వివాహ చట్టం వర్తించబోదంటూ పిటిషన్‌ను స్వీకరించలేదు. దీన్ని సవాలు చేస్తూ వారు దాఖలు చేసిన సివిల్‌ రివిజన్‌ పిటిషన్‌పై ఇటీవల హైకోర్టు విచారణ చేపట్టింది.

Tags

Next Story