High Court : ఎమ్మెల్సీలుగా వారి నామినేషన్ పై కోర్టు వేటు

గవర్నర్ కోటా కింద రాష్ట్ర శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యులుగా తెలంగాణ (Telangana) జనసమితికి చెందిన కోదండరామ్, సియాసత్ దినపత్రిక అమెర్ అలీఖాన్‌ల నామినేషన్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల నామినేషన్‌ను తిరస్కరిస్తూ తెలంగాణ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా కోర్టు కొట్టివేసింది. బెంచ్ ప్రకారం, గవర్నర్ మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉంటారు. గరిష్టంగా, ఈ విషయాన్ని పునఃపరిశీలన కోసం తిరిగి పంపవచ్చు.
అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్ పడింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీరుల్లా ఖాన్‌లు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీల నియామకంపై బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై విచారణ తేలే వరకు ఎమ్మెల్సీల నియామకాలు ఆపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో విచారణకు రాగా.. యథాతథంగా కొనసాగించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను అప్పట్లో ఫిబ్రవరి 8కి హైకోర్టు వాయిదా వేసింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com