TS : గ్రేట్ కదా.. అక్కడ వందశాతం పోలింగ్ నమోదు

TS : గ్రేట్ కదా..  అక్కడ  వందశాతం పోలింగ్ నమోదు
X

మెదక్ జిల్లాలోని సంగాయిపేట తండా ప్రజాస్వామ్య విలువను చాటి చెప్పింది. మెదక్ MP ఎన్నికల్లో భాగంగా కొల్చారం మండలంలోని సంగాయిపేట తండాలో ఏకంగా 100శాతం పోలింగ్ నమోదైంది. ఆ తండాలో మొత్తం 210 మంది ఓటర్లు ఉండగా.. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఓట్లు వేయడంతో ఓటింగ్ సంపూర్ణమైంది. దీంతో తండా వాసులను మెదక్ కలెక్టర్ అభినందించారు.

తెలంగాణలో భువనగిరిలో 76.47%, KMMలో 75.19%, జహీరాబాద్‌లో 74.54%, మెదక్‌లో 74.38%, నల్గొండలో 73.78%, KNRలో 72.33%, ఆదిలాబాద్‌లో 72.96%, MBNRలో 71.54%, మహబూబాబాద్‌లో 70.68%, NZMBలో 71.50%, నాగర్ కర్నూల్‌లో 68.86%, WGLలో 68.29%, PDPLలో 67.88%, చేవెళ్లలో 55.45%, సికింద్రాబాద్ లో 48.11%, మల్కాజిగిరిలో 50.12%, హైదరాబాద్ లో 46.08% ఓటింగ్ నమోదైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 50.34% పోలింగ్ జరిగింది.

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఈవీఎంలకు అధికారులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. వాటిని ఉంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. తరలింపు సమయంలో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక అన్ని స్ట్రాంగ్ రూమ్స్‌ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. తొలి అంచెలో పారామిలిటరీ, రెండో అంచెలో సాయుధ సిబ్బంది, మూడో స్థాయిలో పోలీసులు కాపలా కాస్తున్నారు.

Tags

Next Story