Rythu Bharosa : రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి?

Rythu Bharosa : రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి?
X

రైతు భరోసా(రైతుబంధు) ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు.. మరింత మంది సలహాలు స్వీకరించనున్నారు. ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు. 5 ఎకరాలు, 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.

రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ సబ్‌కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఉన్నారు. రైతు భరోసా పథకం విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయనుంది.

నిర్ణీత నమూనాలో 5 ఎకరాల లోపు, 8 ఎకరాల లోపు, పదెకరాల లోపు, 15, 20, 30 ఎకరాల లోపు... ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఈ సమాచారాన్ని వ్యవసాయాధికారులు సేకరించారు. మరో రెండు రోజుల పాటు ఇది జరగనుంది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించనుంది.

Tags

Next Story