Delhi Liquor Case : లిక్కర్ కేసులో నేను బాధితురాలినే: కవిత

Delhi Liquor Case : లిక్కర్ కేసులో నేను బాధితురాలినే: కవిత
X

ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) తాను బాధితురాలినేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అన్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే ఎదుర్కొంటామన్నారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని.. ఆదర్శ్ స్కామ్ ఉన్న అశోక్ చవాను బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చిందని విమర్శించారు. సీఎంగానూ అవకాశం ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏముందని టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరవు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉందని.. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. మహిళలపై సీఎంకు చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై రేపు ధర్నా చౌక వద్ద దీక్ష చేస్తామని తెలిపారు. రేపటి తమ దీక్షకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. మరికొద్దిసేపు చూసి అనుమతి కోసం కోర్టుకు వెళ్తామని అన్నారు

Tags

Next Story