TS : బిల్డింగ్స్‌కు అక్రమ పర్మిషన్లు.. ఇరిగేషన్ అధికారుల అరెస్ట్

రంగారెడ్డి జిల్లా నీటిపారుదలశాఖ ఏసీబీ సోదాల్లో ట్విస్ట్. నాలా పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ల పర్మిషన్ల వ్యవహారంలో భారీ లంచాలు తీసుకున్నట్టు ఏసీబీ గుర్తించింది. అపార్ట్‌మెంట్లకు పర్మిషన్లు ఇచ్చేందుకు బిల్డర్ల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని తేల్చారు అధికారులు.
ఉన్నతాధికారులే రూ.లక్షల కొద్ది లంచాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. నీటిపారుదలశాఖ ఈఈ బన్సీలాల్, ఏఈ కార్తిక్, నిఖిలేష్ లను డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో పట్టుకున్నారు. నీటిపారుదలశాఖ అధికారులతో పాటు మండల సర్వేయర్ ను అరెస్ట్ చేశారు.
పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న మండల సర్వేయర్ గణేష్ ను పట్టుకున్నారు. రూ.రెండున్నర లక్షల లంచాన్ని ఏఈ, ఈఈ, మండల సర్వేయర్ తీసుకున్నట్టు తేల్చారు. ఇప్పటి వరకు ఇచ్చిన పర్మిషన్లపై ఏసీబీ మరింత ఆరా తీస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com