TG : త్వరలో బీఆర్ఎస్ ఖాళీ ? దానం కామెంట్ల కలకలం

TG : త్వరలో బీఆర్ఎస్ ఖాళీ ? దానం కామెంట్ల కలకలం
X

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో ( Malla Reddy ) సహా త్వరలో కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ( Danam Nagender ) సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్ చాట్ లో ఈ కామెంట్స్ చేశారు. వీరి చేరికతో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ విధానాలే వీఆర్ఎస్ కు శాపంగా పరిణమించాయని అన్నారు. పోచారంతో సీఎం భేటీ పై దానం స్పందిస్తూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాదు చాలామంది బీఆర్ ఎస్ నేతలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరడానికి ఇంట్రెస్ట్ ఉన్నారన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుందని వెల్లడించారు దానం. నిజానికి తన రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలైందని అన్నారు దానం. కాలే యాదయ్య, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ యాదవ్, ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, కుత్బుల్లా పూర్ ఎమ్మెల్యే వివేకానంద్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ చేరిక ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు చేరికలపై రెండు మూడు రోజులుగా సీఎం నివాసంలో చర్చించారని తెలిపారు. పల్లా, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ లు తప్పా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హరీష్ రావుతో కొందరు బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందని దానం అన్నారు. ప్రమాదం నుండి బయటపడే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఐతే.. దానం పరిధులు దాటి మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కౌంటరిచ్చారు. తనలాగే మిగతా ఎమ్మెల్యేలను ఐద్నాం చేయాలని చూస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతం అయిందన్నారు.

Tags

Next Story