Intermediate Board : ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం... గడువు పొడిగింపు

Intermediate Board : ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం...  గడువు పొడిగింపు

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల వినతి మేరకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 4 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితో గడువు ముగియగా.. తాజాగా దాన్ని పొడిగించింది. కాగా ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఈయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండ్ ఈయర్ ఎగ్జామ్ ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.460 పరీక్ష పీజు, ప్రాక్టికల్స్‌కు రూ.170, బ్రిడ్జి కోర్సులకు రూ.120 లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంప్రూవ్‌మెంట్‌ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ పరీక్ష ఫీజుతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1200, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 9.80 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4.78 లక్షల మంది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు, 4.43 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story