Prajavani : ప్రజావాణిలో ఎక్కువ ఫిర్యాదులు వీటిపైనే!

Prajavani : ప్రజావాణిలో ఎక్కువ ఫిర్యాదులు వీటిపైనే!
X

ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రారంభమైన ప్రణావాణిలో ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఒకవైపు వర్షం మరోవైపు తొలిరోజు కావడంతో ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మధ్యాహ్నం ఒంటి గంటవరకే ఫిర్యాదులు స్వీకరించడంతో దూరప్రాంతాలనుంచి వచ్చిన వారు ఫిర్యాదులు చేయకుండానే వెనుదిరిగి పోయారు.

ఆలస్యంగా వచ్చిన వారికోసం ప్రత్యేక ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుచేయక పోవడంతో దూరప్రాంతం నుంచి వచ్చిన వారు నిరాశతో వెళ్లాల్సి వచ్చింది. శుక్రవారం ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకోసం దరఖాస్తులు అధికంగా వచ్చాయి. శుక్రవారం ప్రారంభమైన ప్రజాణి ఫిర్యాదులను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ప్రజావాణి నిర్వహక ఎడు చెన్నారెడ్డి స్వీకరించి సంబంధించిన అధికారులకు అందించారు. అన్ని విభాగాలకు సంబంధించిన మొత్తం ఫిర్యాదులు 373 నమోదు అయ్యాయి.

ఉందులో రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించినవి 120 దరఖాస్తులు, విద్యాశాఖకు సంబంధించి 43, మున్సిపల్ శాఖకు సంబంధించి 29, పౌరసరఫరాలకు సంబంధించి 18, ఇతర శాఖలకు సంబంధించినవి 120 దరఖాస్తులు ఉన్నాయి. ప్రజావాణి ప్రత్యేక అధికారి మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags

Next Story