TS : వాలంటీర్ల లాగే తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు

అధికారం, పదవులు కావాలంటే.. కొన్ని లక్ష్యాలు సాధించాలని అన్నారు సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో క్యాడర్ కు మధ్య కాంపిటీషన్ పెట్టారు. వచ్చే జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని.. పార్టీ తరపున అభ్యర్థిత్వాలు దక్కించుకోవాలంటే తమ తమ ప్రాంతంలోకాంగ్రెస్ కు మెజార్టీ చూపించాల్సిందేనని అంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో బూత్ స్థాయిలో వచ్చే మోజార్టీని బట్టి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు టిక్కెట్లు ఇస్తామని తేల్చిచెప్పారు రేవంత్ రెడ్డి. పథకాలను ప్రతి ఇంటికి చేర్చేందుకు ఇందిరమ్మ కమిటీలను కాంగ్రెస్ క్యాడర్ తో ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీల్లో ప్రతి సభ్యుడికి రూ.6వేల గౌరవ వేతనం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓ రకంగా ఏపీలో వాలంటీర్ల లాంటి వ్యవస్థే ఇది. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఉన్నాయి. ప్రతి 35 ఇళ్లకు ఒకరుచొప్పున సాధికార మిత్రల్ని నియమించారు. ఐతే.. వాలంటీర్లను జగన్ ఎక్కువ చొచ్చుకుపోయేలా వాడటం విమర్శలకు దారితీసింది. ఇందిరమ్మ కమిటీలను రేవంత్ ఎలా ఉపయోగిస్తారన్నది తేలాల్సిఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com