Telangana DGP : ఆసక్తికరంగా తెలంగాణ డీజీపీ రేసు

Telangana DGP : ఆసక్తికరంగా తెలంగాణ డీజీపీ రేసు

తెలంగాణలో కీలక ఐపీఎస్ బదిలీలు జరగనున్నాయి. కొత్త డీజీపీ ఎవరనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తను అదే హోదాలో కీలక స్థానానికి బదిలీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. డీజీపీని మార్చాలని ప్రభుత్వం భావిస్తే రేసులో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి ఉన్నట్లు పోలీసు వర్గాలలో చర్చ సాగుతోంది.

ప్రస్తుతం ఏడీజీలుగా ఉన్న వారికి రాష్ట్ర డీజీపీ బాధ్యతలు అప్పగిస్తే సర్వీస్ ప్రాతిపదికన అందుకోవాల్సిన వాళ్లు క్యాట్ ను ఆశ్రయించే చాన్సుంది. దీంతో.. రేవంత్ సర్కారు ఆలోచనలో పడింది. తాజా బదిలీలలో వివాదాలు, ఆరోపణలకు తావులేకుండా చూసుకోవాలని భావిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఎవరైతే సూటవుతారో వాళ్ల పేర్లు ఎంపికచేసే పనిలో ప్రభుత్వం కసరత్తు పూర్తిచేస్తోంది. అసంతృప్తులకు కీలక బాధ్యతలు అప్పగించి వివాదాలు రాకుండా చూసుకోవాలని భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story