TS : అమెరికా నుంచి కేటీఆర్ కు ఆహ్వానం

TS : అమెరికా నుంచి కేటీఆర్ కు ఆహ్వానం

అమెరికాలోని (America) నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న జరగబోతున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి రూపకల్పన చేసిన పాలసీలు, అవి సాధించిన విజయాలను సదస్సులో వివరించి స్ఫూర్తి నింపాలని కేటిఆర్ ను కోరారు.

ఈ మేరకు యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఎగ్సిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ శ్వేత మేడపాటి లేఖలో విజ్ఞప్తి చేశారు. అమెరి కాలోని ఇవాన్ స్టన్ లో 1908లో నెలకొల్పిన ఈ బిజినెస్ స్కూల్ ప్రపంచ వ్యాప్తం గా బెస్ట్ బిజినెస్ ర్యాంకింగ్ లో రెండో స్థానంలో నిలిచిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం భారత్ లోని పారిశ్రామిక రంగంలో కొత్త అవకాశాలు ఎలా ఉండబో తున్నాయి.

క్షేత్రస్థాయిలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంశంపై చర్చించేందుకు ఇండస్ట్రీ లీడర్లను, వ్యాపారవేత్తలను, విధానాల రూప కల్పనలో అనుభవం కలిగిన నాయకులను ఒక్క తాటిపైకి తేవాలన్న ఆలోచనతోనే ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు శ్వేత మేడపాటి తెలిపారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఆమె పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story