TS : ఇదెక్కడి అరాచకం.. కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్

TS : ఇదెక్కడి అరాచకం.. కేసీఆర్ గొంతుపైనే నిషేధమా?  :  కేటీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ 48 గంటల నిషేధం విధించడంపై కేటీఆర్ ఫైరయ్యారు. ‘ఇదెక్కడి అరాచకం? ఏకంగా తెలంగాణ అవాజ్ అయిన కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనల్లాగా అనిపించాయా? బడే భాయ్.. చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది!’ అని ట్విట్టర్ లో ప్రశ్నించారు.

ఈసీ నిషేధంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. ‘నా మాటలను, స్థానిక మాండలికాన్ని అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని, వాటిని వక్రీకరించి ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించా’ అని కేసీఆర్ తెలిపారు.

ఏప్రిల్ 5న సిరిసిల్లలో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ‌‌‌‌‌‌‌‌‌‌..‘‘ప్రజలు బతకడానికి పాప డాలు, నిరోధులు అమ్ముకోమని చెప్పడానికి కాంగ్రెస్ నేతలు కుక్కల కొడుకులా? నీళ్లివ్వడం చేతగాని లత్కోర్లు రాజ్యమేలుతున్నరు. అసమర్థులు, చవటలు, దద్దమ్మలు ఈ రాజ్యంలో ఉన్నరు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన్రు. పంటలకు రూ.500 బోనస్ ఇవ్వకపోతే మీ గొంతు కోస్తం.. చంపేస్తాం’’అంటూ కామెంట్లు చేశారు. వీటిపై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story