Teenmar Malanna : తీన్మార్ మల్లన్నకు జాక్ పాట్

Teenmar Malanna : తీన్మార్ మల్లన్నకు జాక్ పాట్

ప్రజా ప్రతినిధి అనిపించుకోవాలని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఎప్పటినుంచో ఆరాటపడుతున్నారు. పలుమార్లు ఎన్నికల్లో పోటీచేసినా ఆయనకు అదృష్టం వరించలేదు. ఐతే.. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ బైపోల్ లో ఆయన పేరు మరోసారి మార్మోగుతోంది.

పల్లారాజేశ్వర్ రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన జనగాంనుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ బైపోల్ అనివార్యమైంది. దీంతో.. పల్లా చేతిలో స్వల్ప తేడాతో ఓడిన తీన్మార్ మల్లన్నను బరిలోకి దింపింది కాంగ్రెస్. పట్టభద్రుల ఎమ్మెల్సీకి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది.

2021లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. కోదండరాంను కూడా దాటేసి రెండో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. తన నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని పట్టభద్రుల ఓట్లను పెద్ద ఎత్తున చేయించి పకడ్బందీ పోల్ మానేజ్ మెంట్ తో గట్టెక్కారు పల్లా. ఐతే.. జనం మాత్రం ఎతికల్ గా తీన్మార్ మల్లన్నే గెలిచాడని చెప్పుకున్నారు. ఏదిఏమైనా గెలుపు గెలుపే. ఈసారి మాత్రం పక్కాగా ఎమ్మెల్సీ అనిపించుకోవాలని తీన్మార్ మల్లన్న ఆశిస్తున్నారు. గెలుపు కూడా పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గెలిస్తే మూడేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు నవీన్ కుమార్.

Tags

Next Story