TG : జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

TG : జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
X

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jagga Reddy ) షాకింగ్ కామెంట్స్ చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. తాను చిన్నప్పుడు ఆర్ఎస్‌ఎస్ శాఖకి వెళ్లానని అన్నారు. తాను ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖకు పోయినప్పుడు రఘునందన్‌కి దాని గుర్చి తెలియదన్నారు.

తాను రాజకీయం చేస్తున్నప్పుడు రఘునందన్‌ గల్లీలో గోళీలు ఆడుతున్నాడన్నారు. ITIR మంజూరు చేసే వరకు తాను మాట్లాడుతూనే ఉంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ITIR తేవాలని ఇద్దరు కేంద్ర మంత్రులను అడుగుతానని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో తెలంగాణకు ITIR ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పక్కన పెట్టారని మండిపడ్డారు. హైదారాబాద్‌ను ఆనుకొని నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా ITIR పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

హైదరాబాద్ కి ITIR వస్తే కోట్లాది పెట్టుబడులు వస్తాయని చెప్పుకొచ్చారు. ITIR హైదరాబాద్ తేవాలని కేంద్ర మంత్రులను కలుస్తానని అన్నారు. ITIR తెచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Tags

Next Story