TG : నన్ను క్షమించండి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఆడియో వైరల్

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ( Sanjay Kumar ).. పార్టీ మార్పు వ్యవహారంపై ఆడియో రిలీజ్ చేశారు. పార్టీకి దూరమవుతున్నందుకు తనను క్షమించాలని బీఆర్ఎస్ కార్యకర్తలను అయన కోరారు. జగిత్యాల ప్రాంత అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించానని తెలిపారు.
మంత్రులు కూడా సహకారం అందిస్తానని చెప్పినట్లు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు తనతో ఉండొచ్చని తెలిపారు. కాంగ్రెస్ లో తన చేరికపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చన్న సంజయ్ కుమార్.. అందరి తో చర్చించాకే పార్టీ మారినట్లు వివరించారు.
'బీఆర్ఎస్ నాయకులకు అందరికీ నా నమస్కారం. మీ అందరి సహకా రంతోనే నేను ఎమ్మెల్యేగా గెలిచాను. జగిత్యాల ప్రాంత అభి వృద్ధి విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పని చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చాలామంది పలుమార్లు వ్యక్తం చేశారు. ఇందులో భిన్నాభిప్రాయాలు కూడా ఉండొ చ్చు, పార్టీకి దూరమవుతున్నందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు నన్ను క్షమించాలి. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్పారు' అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com