Telangana DGP : తెలంగాణ డీజీపీగా జితేందర్.. నేడు ఉత్తర్వులు!

తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను సీఎం రేవంత్ ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడు జారీ కావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన ఆయన 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. వచ్చే ఏడాది సెప్టెంబరుతో ఆయన సర్వీస్ కాలం ముగుస్తోంది. ముందుగా నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన ఈయన అనంతరం.. బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా పనిచేశారు. ఢిల్లీ సీబీఐలో 2004 నుంచి 2006 వరకు గ్రేహౌండ్స్ లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతి పొంది వైజాగ్ రేంజ్ లో బాధ్యతలు చేపట్టారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం డీజీపీ రవిగుప్తాను ప్రభుత్వం నియమించలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి డీజీపీ అంజనికుమార్‌ను క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేసిన ఎన్నికల కమిషన్.. రవిగుప్తాను డీజీపీగా నియమించింది. 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సీపీగా ఉండగా, సౌమ్యమిశ్రా జైళ్లశాఖ డీజీగా, శివధర్‌రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా, శిఖాగోయెల్ ఉమెన్ సేఫ్టీ వింగ్ సీఐడీగా, ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీగా, అభిలాష బిస్త్ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. వీరికి ఇంకా డీజీపీ హోదా రాకపోవడంతో సీనియర్ అయిన జితేందర్ వైపు ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com