TG : సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించండి - పొన్నం

TG : సర్కారు బడుల్లో పిల్లలను చేర్పించండి - పొన్నం

హైదరాబాద్ లోని అబిడ్స్ అలియా మోడల్ హైస్కూల్ లో పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ),గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, గన్ ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్, డీఈవో రోహిణి ఇతర ముఖ్య అధికారులు అటెండయ్యారు. పదవ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సన్మానం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్కూల్ రీఓపెన్ కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు,యూనిఫాం పంపిణీ చేశారు.

"ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కోడ్ కి ముందే ప్రభుత్వం తెలంగాణ లో 26 వేల స్కూల్ లకి రూ.11 వందల కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతులు విద్యుత్, డ్రింకింగ్ వాటర్ ,టేబుల్స్ ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాం. గత 10 సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది. రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత విద్య ఉండబోతుంది. ముఖ్యమంత్రి ,నేను, మంత్రులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వాళ్ళమే. ప్రతి పాఠశాలలో అనుభవమైన ఉపాధ్యాయులు ఉన్నారనీ.. రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికి పంపాలని విజ్ఞప్తిచేస్తున్నా. పాఠశాలలో అనేక వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, కంప్యూటర్ ఇలా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. " అన్నారు పొన్నం ప్రభాకర్.

విద్యార్థులు మంచిగా చదువుకోవాలనీ.. విద్యార్థులకు సమాజం గురించి, విద్య గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని కోరారు పొన్నం. మెగా డీఎస్సీ ద్వారా ఖాళీలు భర్తీ చేస్తున్నామన్నారు.

Tags

Next Story