Karimagar Woman : అగ్నిపర్వతం అధిరోహించిన కరీంనగర్ యువతి

Karimagar Woman : అగ్నిపర్వతం అధిరోహించిన కరీంనగర్ యువతి
X

ఆసియా ఖండంలో ఏకైక అగ్నిపర్వతాన్ని అధిరోహించారు ఇద్దరు మహిళళు. అండమాన్ నికోబార్ దీవులలో బెరన్ ఐలాండ్లో ఈ వాల్కనో ఉంది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణ వాసి మహమ్మద్ పర్వీన్ సుల్తానా ఆ ఇద్దరిలో ఒకరు కావడం విశేషం.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సెస్, డెహ్రాడూన్, ఇస్రో వారి ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా డాక్టర్ మమతా చౌహాన్ ప్రధాన శాస్త్రవేత్త సారథ్యంలో వివిధ రంగాల పరిశోధకుల బృందంలో ఒకరిగా కరీంనగర్ కోతిరాంపూర్ కు చెందిన మహమ్మద్ పర్వీన్ సుల్తానా పాల్గొన్నారు.

గత నెల 29న బెరెన్ ఐలాండ్లోని అగ్నిపర్వతంపై మహిళలు అడుగిడడం ద్వారా చారిత్రిక దృశ్యం ఆవిష్కృతమైంది. అగ్నిపర్వతం భౌగోళిక పరిణామాలు, శాస్త్రీయ విశ్లేషణ, అగ్నిపర్వత ప్రకృతి విపత్కర పరిస్థితులపై అంచనా అవగాహన కోసం అక్కడ లభించిన వివిధ రకాల నమూనాలను సేకరించారు. అండమాన్ ఐలాండ్లోని డిగ్లీపూర్ నుండి రంగౌత్ వరకు సుమారు వంద కిలోమీటర్లకు పైగా వివిధ ప్రాంతాలలో ఉన్నవాల్కనో మట్టిని పరిశీలించి నమూనాలను సేకరించారు.

Tags

Next Story