Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బిగుస్తున్న ఉచ్చు!

Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బిగుస్తున్న ఉచ్చు!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు.. ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాడులు సోదాలు జరుగుతున్నాయి. దీంతో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) కేసీఆర్ (KCR) కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఉచ్చు బిగుస్తోంది. గతంలో ఆమెకు నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఈసారి ఏకంగా కవిత ఇంట్లో సోదాలు చేస్తోంది. లిక్కర్ స్కాం నిందితులతో ఆమె లావాదేవీలు జరిపినట్లు ఆరోపిస్తున్న ఈడీ.. MLC ఖాతాలను చెక్ చేస్తున్నట్లు సమాచారం. స్కాంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు చిన్న ఆధారం లభించినా.. తర్వాత ఈడీ తీసుకునే చర్యలపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తుండటంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే 24 గంటల ముందు ఈడీ సోదాలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పోటీ చేయాలంటే బీజేపీకి ఈడీ అవసరం అంటూ విమర్శలు చేస్తున్నాయి. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story