TS : కవిత అరెస్టు.. మౌనంగా కేసీఆర్

ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అరెస్టును ఆమె సోదరుడు కేటీఆర్ (KTR), హరీశ్ రావుతో (Harish Rao) పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఆ పార్టీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. అయితే కవిత అరెస్టుపై ఆమె తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆయన మౌనం వెనక అర్థం ఏంటనే చర్చ జరుగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందని 2022లో ఆగస్టు 21న బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో కవిత కలిశారని ఆయన అన్నారు. అప్పుడు వర్మపై కవిత పరువునష్టం దావా కూడా వేశారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. కానీ.. కొంతకాలానికి ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఆమె అరెస్టయ్యారు. ఇలా.. 2ఏళ్ల క్రితం పర్వేశ్ తీగ లాగితే డొంక మొత్తం కదిలింది.
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ జడ్జి నాగ్‌పాల్ బెంచ్ ముందు హాజరుపర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన మనీష్ సిసోడియా, మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి తదితరులకు జస్టిస్ నాగ్‌పాల్ కస్టడీ విధించారు. దీంతో కవితకు కూడా కస్టడీ తప్పదని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కవిత, ఈడీ వినతులపై జడ్జి ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com