Goa Elections : గోవా ఎన్నికలకు కవిత ఫండింగ్.. ఈడీ ఆరోపణలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావన వచ్చింది. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నారని.. ఎమ్మెల్సీ కవిత తన పీఏ అశోక్ కౌశిక్ ద్వారా రెండు బ్యాగుల్లో కోట్ల రూపాయలను పంపించారని, ఆ నగదను దినేశ్ అరోరాకు ఇచ్చారని, దాన్ని ఆప్ గోవా ఎన్నికల్లో వాడుకుందని ఈడీ ఆరోపించింది.
ఢిల్లీలోని వినోద్ చౌహాన్ దగ్గర అశోక్, దినేశ్ అరోరాలు కలుసుకున్నారని ఈడీ పేర్కొంది. ఇందుకు ఆధారంగా కేజ్రీవాల్ కు- వినోద్ కు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను రిట్రీవ్ చేసినట్లు కోర్టుకు తెలిపింది. మీడియా సంస్థలో ఉన్న ముత్త గౌతమ్ ద్వారా అభిషేక్ బోయినపల్లి, హవాలా ద్వారా డబ్బు తరలించినట్లు ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొత్తం రూ.100 కోట్లు చేతులు మారాయని.. అవన్నీ గోవా ఎన్నికల్లో ఆప్ వాడుకుందని ఈడీ కోర్టుకు తెలిపింది.
ఈ కేసులో 38 మందిని నిందితులుగా పేర్కొన్న ఈడీ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును37వ నిందితుడిగా చేర్చింది. ఛార్జిషీటు ప్రకారం.. ఈ కేసులో కేజ్రీవాల్‌ను కీలక నిందితుడిగా ఈడీ పేర్కొంది. గోవా ఎన్నికల్లో ముడుపుల సొమ్ము వినియోగించిన విషయం ఆయనకు తెలుసని వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com