TS : కవితకు చివరిరోజు కస్టడీ

TS : కవితకు చివరిరోజు కస్టడీ

లిక్కర్‌ స్కాం కేసులో (Liquor Scam Case) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ తో ఈడీ పట్టుబిగించింది. దర్యాప్తు వేగవంతం చేసింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న అరెస్ట్‌ చేసిన ఈడీ.. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. మరోవైపు కవిత కస్టడీ విచారణ కొనసాగుతుండగానే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కూడా ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం డిల్లీ లిక్కర్ స్కాం అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న లిక్కర్‌ స్కాం విచారణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగుస్తుంది. మధ్యాహ్నం తర్వాత కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. కస్టడీ విచారణలో భాగంగా ఈ కేసులో పురోగతి గురించి ఈడీ అధికారులు కోర్టుకు వివరించనున్నారు. కవితను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.

కవిత ఈడీ కస్టడీ పొడగింపు లేదా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం కూడా ఉంది. గత ఆరు రోజులుగా ఢిల్లీలోని కేంద్ర కేంద్ర కార్యాలయం ప్రవర్తన్‌ భవన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తల్లి శోభ, అన్న కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. కోర్టు తీర్పు సందర్భంగా కీలకమైన ఫ్యామిలీ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story