TG : తొందర పడకండి .. ఎమ్మెల్యేలతో కేసీఆర్

ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం కేసీఆర్ ( KCR ) భేటీ అయ్యారు. ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో నేతలతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం కాగా, ఇవాళ హరీశ్ రావు, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. పార్టీ మారుతున్న నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తొందరపడొద్దని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిన అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. అలాంటి వారు పార్టీ మారడాన్ని పట్టించుకోవద్దని సూచించారు. వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు
బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యే లుగా గెలిచి ఇటీవల కాంగ్రెస్‌లోకి వెళ్లిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్‌కుమార్‌లను అనర్హులుగా ప్రకటించాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పీకర్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మెయిల్, పోస్టు ద్వారా ఫిర్యాదు చేశానని చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యతిరేకంగా ఉన్నారని, ఫిరాయింపుల గురించి ఆ పార్టీ ‘పాంచ్ న్యాయ్’లోనూ ఉందని ఆయన గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com