KCR : ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్

KCR : ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్
X

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ( KCR ) ఓమ్నీ వ్యాన్ నడిపారు. తుంటి గాయం నుంచి కోలుకుంటున్న ఆయనకు మాన్యువల్‌గా కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించడంతో తన పాత ఓమ్నీ వ్యాన్ నడిపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కేసీఆర్ వాహనం నడపడంతో ‘‘సారు మళ్లీ ‘కారు’ నడపడం మొదలుపెట్టారు’’ అని పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్ అక్కడ బాత్ రూమ్ లో కాలుజారి కిందపడడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటినా సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యుల బృందం.. తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. అనంతరం కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ స్టిక్ తోనే నడుస్తున్నారు.

Tags

Next Story