KCR : ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. వీడియో వైరల్
బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( KCR ) ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ లో రిలాక్స్ అవుతున్నారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అక్కడే పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నారు. ప్రతిరోజు కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు వచ్చి ఆయనను కలిసి ఫొటోలు దిగుతున్నారు. కేసీఆర్ కూడా కార్యకర్తలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆరా తీస్తున్నారు.
కర్ర సాయం లేకుండానే కేసీఆర్ ఇప్పుడు నడుస్తున్నారు. సమయం దొరకడంతో తన ఎంతో ఇష్టమైన వ్యవసాయానికి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారు. వ్యవసాయ పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన బీఆర్ఎస్ బాస్ కారు నడిపారు. కేసీఆర్ స్వయంగా కారు నడిపిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ముగ్గురిని కారులో ఎక్కించుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకుని కారు నడుపుతున్నట్టుగా ఫొటోలో కనిపించింది.
కేసీఆర్ జోరు చూసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ వ్యాన్ డ్రైవింగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com