TS : రంగంలోకి కేసీఆర్.. రేపటి నుంచి జిల్లాల పర్యటన

TS : రంగంలోకి కేసీఆర్.. రేపటి నుంచి జిల్లాల పర్యటన
X

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) రంగంలోకి దిగుతున్నారు. రైతాంగం సమస్యలను తెలుసుకునేందుకు బయలుదేరుతున్నారు. సాగు నీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, కాంగ్రెస్ సృష్టించిన కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యం నింపనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా మొదట ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పంట పొలాలను పరిశీలించి రైతులను అడిగి తెలుసుకోనున్నారు.

రేపు జనగామ, సూర్యాపేట జిల్లాలో పర్యటన కొనసాగనుంది. జనగామ నుంచి దేవరుప్పుల, తుంగతుర్తి, సూర్యాపేట చేరుకో నున్నారు. సూర్యాపేటలో రాత్రి బస చేసే అవకాశాలున్నాయి. అనంతరం మరుసటి రోజు సూర్యాపేట నుంచి కోదాడ, మిర్యాలగూడ, హాలియా మీదుగా దేవరకొండకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు కేసీఆర్ రానున్నారు. బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ పంట పొలాలను పరిశీలించేందుకు రానున్నారు.

రూట్ మ్యాప్ లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఆగి రైతులతో ముచ్చటించనున్నారు. రైతులను అడిగి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీరు, సాగు నీరు ఇచ్చే అవకాశాలు ఉన్నా ఇవ్వకపోవడంపై నిలదీయ నున్నారు. దారి వెంట వెళ్తూ రైతులతో ముచ్చటించనున్నారు. కాళేశ్వరం జలాలు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ కాంగ్రెస్పై మండిపడుతోంది. అటు సాగర్ ఆయకట్టు విషయంలోనూ కాంగ్రెస్ పంట పొలాలకు నీరు ఇవ్వడం లేదని విమర్శలు గుప్పిస్తోంది.

Tags

Next Story