TS : కేసీఆర్ గొప్ప నాయకుడు... జీవితాంతం రుణపడి ఉంటా: దానం నాగేందర్

తనకు బీఆర్ఎస్‌లో (BRS) అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు (KCR) రుణపడి ఉంటానని కాంగ్రెస్ (Congress) నేత దానం నాగేందర్ (Danam Nagender) తెలిపారు. ‘ఆయన గొప్ప నాయకుడు. కానీ వారి చుట్టూ కందిరీగల్లా కొంతమంది చేరారు. వారి గురించి త్వరలోనే తెలుసుకుంటారు. నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్‌లో నిర్మొహమాటంగా, స్వేచ్ఛగా మాట్లాడగలను’ అని పేర్కొన్నారు. కాగా.. దానంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఆయన్ను కన్నబిడ్డలా చూసుకున్నారని వివరించారు.
బీజేపీతో కలుస్తున్నామని కేటీఆర్ (KTR) అన్నందుకే తాను కాంగ్రెస్‌లో చేరానని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఈ మాట తనతో అనలేదని ప్రమాణం చేస్తారా? అని సవాల్ చేశారు. తామంతా బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అనుకున్నామని, అక్కడ నేతలకు ఆత్మగౌరవం ఉండదని దానం పేర్కొన్నారు.
కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగరానికి చెందిన రాజు యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ బీఫామ్‌పై పోటీ చేసి దానం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com