TG : పాదయాత్రకు కేసీఆర్ రెడీ.. కేటీఆర్ హింట్

ప్రజాక్షేత్రంలోకి దిగేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక వైపు కాంగ్రెస్ లోకి వెళ్తుండగా.. మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగాలని బీఆర్ఎస్ అధిష్టానం డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ( KTR ) యాత్ర చేయించేందుకు గులాబీ బాస్ కేసీఆర్ ( KCR ) సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని పటిష్టంగా మార్చేందుకు కేటీఆర్ అయితే బెటర్ అనే ఆలోచనకు కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కొంత మంది ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఆ సందర్భంలో పలు కీలక విషయాలు చర్చించారని సమాచారం. ముఖ్య నేతలతో కేసీఆర్ ఇదే విషయంపై మాట్లాడుతూ.. పాదయాత్ర చేయించే విషయంపై ఆలోచిస్తున్నానని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా, అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర ఉండనున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ పవర్ లోకి వస్తుందని కేసీఆర్ కాన్పిడెంట్ తో ఉండటం.. పార్టీలో కొత్త జోరు నింపుతుందని కేటీఆర్ సహా సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com