TS : తప్పులేడ జరిగినయో కేసీఆర్ విశ్లేషించుకోవాలి : విజయశాంతి

ఎంపీ, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కే కేశవరావు పార్టీ మారడం పట్ల కాంగ్రెస్ నేత విజయశాంతి (Vijayashanti) ఆసక్తికర కామెంట్లు చేశారు. బీఆర్ఎస్‌కు (BRS) నేతలు దూరమవుతుండం పట్ల కేసీఆర్ విశ్లేషించుకోవాలని సూచించారు. నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ మొదటి సెక్రటరీ జనరల్ విజయశాంతిని అధ్యక్షుడు కేసీఆర్ కారణం చూపక, కనీసం షోకాజ్ నోటీస్కూడా ఇయ్యక పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒకప్పుడు ఎల్లగొట్టిన్రు.
ఇయ్యాల్టి బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు ఆత్మగౌరవ రీత్యా ఆ పార్టీకి దూరం కానున్నట్లు వార్తలు ఎల్తున్నయి. తప్పులేడ జరిగినయో, అందరెందుకు దూరమైతున్నరో, కేసీఆర్ తన ప్రభావం తానే ఏ కారణాలతో రోజు రోజుకి కోల్పోతున్నరో వారే విశ్లేషించుకోవటం అవసరం’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్స్చేస్తూ.. ‘మీ కడుపు కోత అర్థం అవుతుంది రాములమ్మా. కేసీఆర్ నిజమైన తెలంగాణ బిడ్డలను మోసం చేసినందుకు కర్మఫలితం అనుభవిస్తున్నరు’ అని సెటైర్లు వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com